Chandragiri constituency Repolling Voter Rush,Vizagvision..చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని
పులివారి పల్లెలో ఓటు వేశారు.ఓటర్లు బూత్ సెంటర్ లలో ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. దొంగ ఓటు వేస్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పులివర్తి వారి పల్లి లో జరిగిన సంఘటనపై టిడిపి అభ్యర్థి నాని పై కేసు నమోదు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం లో పులివర్తివారి పల్లిలో రీపోలింగ్ సందర్భంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి ఎవరైనా ప్రవేశించాలన్నా , ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపాలని చిత్తూరు జిల్లా ఎస్పీ
ఆదేశించారు. దీంతో గ్రామం నలు వైపులా, సరిహద్దుల్లో
పోలీసులు పహారా కాస్తున్నారు. కాగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని తన స్వగ్రామంలో
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ప్రజలు
స్వచ్ఛందంగా ఓటింగ్‌కు తరలి వస్తున్నారు. వ్రృద్దులు సైతం
ఎండను లెక్క చేయక ఓటింగ్‌కు తరలి వస్తున్నారు
మరోవైపు 321 పోలింగ్ కేంద్రం
కమ్మపల్లి దగ్గర దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలతో మునిచంద్ర నాయుడు అనే వ్యక్తిని
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
కాగా పాకాల మండలం పులవర్తివారి పల్లిలో తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ,జనరల్ ఏజెంటుగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సోదరుడిపై దాడి చేశాడని సమాచారం. రోడ్డు మీద వెళ్తున్న అతన్ని అడ్డగించి కర్రలతో దాడి చేసి జనరల్ ఏజెంట్ ఫారం చించివేత
ఆరోపణలతో కలెక్టర్ ప్రధ్యుమ్న
స్పందించారు. ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.