Heavy Temperature Increases Public Facing Hot Summer in ,Visakhapatnam,Vizag Vision…
విశాఖలో ఎండలు మండుతున్నాయి..కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 34 డిగ్రీలకు పైబడినమోదవుతున్నాయి…
బైటకు రావాలంటేనే నగరవాసులు బెబేలెత్తిపోతున్నారు..గత ఏడాది గరిష్ట ఉష్ణోగ్రత లు 50 క్రాస్ అవ్వడంతో ఈ ఏడాది కూడా అదేభయం వెంటాడుతోంది…
వాయిస్ : విశాఖ అంటే సమశీతోష్ణ వాతావరణంతో ఆహ్లాదంగా వుండే ప్రదేశం.
మూడువైపులా కొండలు, ఓ వైపు సముద్రం తో అలరారే సుందరనగరం..
1980 దశకం వరకూ పరిస్ధితి ఇది..తర్వాత కాలంలో రానురాను పరిస్ధితి మారిపోతూవచ్చింది..ఎత్తయిన కాంక్రీట్ భవనాలు,కొండలపై నిర్మాణాలు,పరిశ్రమలనుంచి వచ్చే కాలుష్యం తో వాతావరణం లో మార్పులు చోటు చేసుకోవడం మొదలైంది..1980 వరకూ గరిష్ట ఉష్ణోగ్రత లు 28 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటినమోదయ్యే దాఖలాలు లేవు…కానీ ఇప్పుడు అది 50 డిగ్రీలకు పెరిగిన సందర్భాలను నగరవాసులు చవిచూస్తున్నారు…
సముద్రతీరం వెంబడి ఎత్తయిన ఆకాశహార్మ్యాలు మొదలయ్యాక
సముద్రం నుంచి వీచే పవనాలు నగరం మీదకు రాకుండానే నిర్వీర్యమైపోతున్నాయి…నగరానికి పశ్చిమదిక్కునవున్న పరిశ్రమలు…వాటినుంచి ఉత్పన్న మయ్యే కాలుష్యం నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి మరో కారణమనే చెప్పాలి.
వీటన్నిటికన్నా అసలు కారణం నగరంలో పచ్చదనం పూర్తిగా కనుమరుగవ్వడం
చెట్లు పెంచేందుకు ఖాళీజాగా లేకపోవడం బాధాకరం…గాలిలో ఆక్సిజన్ శాతం కన్నా కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోవడం ఉష్ణోగ్రత లు అమాంతం పెరిగిపోవడానికి కారణమంటున్నారు నిపుణులు..ఇప్పుడే ఇలా వుంటే ఇక మే నెల వచ్చాక పరిస్ధితి ఏంటా అనేదే ప్రశ్న…ఒకప్పటి వేసవి విడిదిగా వుండే విశాఖను మళ్లీ అలా చూసే రోజులు వస్తాయా…రాష్ట్రం లో మరేనగరానికి లేని అరుదైన సహజసిద్ద వాతావరణ పరిస్ధితులను కాపాడుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాల్సిందే…
















