కాళ్ళ నరాల వాపు సమస్యపై 19,20 తేదీల్లో రేడియాలజీ చికిత్స
ప్రముఖ అంతర్జాతీయ రేడియాలజిస్ట్ మావెస్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ పటేల్ కోల విశాఖపట్నం లో కాళ్ళ నరాల వాపు (వెరికోస్ వీన్స్) కు సంబంధించి 19, 20 తేదీల్లో సేవలు అందించనున్నట్టు తెలిపారు. గురువారం అయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాళ్లలో వాపు, మంట, కాళ్లపై నరాలు ఉబ్బడం, రంగు మారుట, పుండ్లు ఏర్పడడం, బరువెక్కడం, దురద వంటి లక్షణాలు కలిగిన వారు వెరికోస్ వీన్స్ గా పరిగణించడం జరుగుతుందని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యాధికి తొలుత హైదరాబాద్ లో తామే మొదటి సెంటర్ ను దశాబ్దం క్రితం ప్రారంభించామని చెప్పరు. ఈ వ్యాధి తో బాధపడేవారికి స్థానికంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో శుక్ర (19), శనివారాల్లో(20) కెజిహెచ్ డౌన్ లోని లూసీడ్ డయాగ్నస్టిక్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు రోజుల పాటు ఆధునిక వైద్య ఈ చికిత్సను అందిస్తామని తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో తాను 6000 మంది వెరికోస్ బాధితులకు ఈ చికిత్స అందించానని చెప్పారు. 97 శాతానికి పైగా రేడియాలజీ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించిందని పేర్కొన్నారు. భారతదేశంలో 30 శాతం మంది ఈ సాధారణ సమస్యతో బాధపడుతున్నారని, కాళ్ళ నరాలకు సరఫరా అయిన రక్తం తిరిగి సరిగా ప్రసరణ జరగని కారణంగా ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని ప్రారంభంలోనే తగిన చికిత్స పొందితే త్వరితగతిన నివారణ అవుతుందని డాక్టర్ బాలాజీ పటేల్ కోల తెలిపారు. ప్రారంభంలో ఇది కాస్మెటిక్ డిసీజ్ గ పరిగణించ వచ్చని, తరువాత మాత్రం నొప్పి, పుండ్లు రావడం వల్ల భయపడతారని, సర్జరీ ద్వారా చేయించుకోవడాని భయపడతారని ఆధునిక విధానం ద్వారా తానూ చికిత్స అందిచడం ద్వారా ఎటువంటి భయానికి లోను కాకుండానే పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. రెండురోజుల పాటు అందించే సేవలను వినియోగించు కోవాలని, మరిన్ని వివరాలకు 8121800400, 8121200400 నంబర్లలో సంప్రదించాలని కోరారు.