చాపా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవంతంగా కాశి యాత్ర హోమం
నిరు పేదలకు ఉచిత అన్నదాన సేవ చేస్తున్న చాపా ఛారిటబుల్ ట్రస్ట్ సోమవారం కాశి యాత్ర హోమం విజయ వంతంగా నిర్వహించింది. 18 మంది పేదలను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కాశి యాత్ర తీసుకువెళ్తున్న సందర్భంగా అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్డు లోని రామచంద్రనగర్ లో గల ట్రస్ట్ ప్రాంగణంలో లక్ష్మి గణపతి, విధి గణపతి హోమము నిర్వహించారు. చాపా ట్రస్ట్ అధినేత చాపా బాల కృష్ణ ఆధ్వర్యంలో భక్త బృందం సోమవారం సాయంత్రం యాత్రకు బయలు దేరుతుంది. 2017 లో తొలిసారిగా ఎనిమిది మంది పేదలను ట్రస్ట్ తరఫున యాత్రకు తీసుకు వెళ్లారు. రెండేళ్లు విరామం తర్వాత మరల 18 మందిని ఉచితంగా యాత్రకు ట్రస్ట్ తీసుకు వెళ్తుంది. ముందుగా త్రివేణి సంగమం పుణ్య స్నానాలు చేస్తారా. కాశిలో గంగా స్నానం, విశాలాక్షి, విశ్వేశ్వరుని దర్శనం అనంతరం మరుసటి రోజున రుద్రాభిషేకం, సత్య నారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థపకులు బాల కృష్ణ తెలిపారు. ఐదేళ్లుగా రాత్రి పూట పేదలకు అన్నదానం చేస్తూ కాశి యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా పౌర్ణమి నాడు ఉచితంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం, గో పూజ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
















