వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత, Vizagvision. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. వివేకానంద రెడ్డి హఠానర్మణం చెందారు. గురువారం(మార్చి 15) అర్థరాత్రి ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. వివేకానంద రెడ్డి మృతి వైసీపీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్నటి వరకు ఎంతో యాక్టివ్ గా కనిపించిన ఆయన.. సడెన్ గా మృతి చెందడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర రాజకీయ అంశాల్లో చురుగ్గా కనిపించిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయారు అంటే ఎవరూ విశ్వసించడం లేదు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు. అన్ని విషయాల్లో అన్నకు చేదోడు వాదోడుగా నిలిచారు. అలాంటి వ్యక్తి మరణం జగన్ కుటుంబానికి తీరని లోటుగా చెప్పొచ్చు…

















