Minister Ganta Srinivas Comments on YS Jagan in Visakhapatnam,Vizag Vision…
అధికారం కోసం వైసీపీ కుటిల యత్నాలు చేస్తోంది. అధికారంలోకి రాకముందే జగన్ అరాచకాలు, అకృత్యాలు చూడాల్సి వస్తోంది.
ఓటర్ల జాబితాలో తాజాగా పరిశీలన చేస్తుంటే నివ్వెరపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. టీడీపీని ఎదుర్కోలేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.
టీడీపీ సానుభూతిపరులు ఉన్న ఓటర్ల జాబితాలో కొందరు ఓట్ల తొలగింపునకు వైసీపీ పాల్పడుతోంది.
భీమిలిలో 8778 ఓట్లు, ఈస్ట్, సోత్ అలా అన్ని నియజకవర్గాల్లో. మొత్తం 74848 ఓట్లు తొలగించాలని ఫార్మ్ 7 అధికారులకు ఇచ్చారు.
తెలంగాణలో కూడా ఇలానే చేసి టీఆరెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వైసీపీ కూడా అదే దారి ఎంచుకుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహారం ఉంది.
ఒకే వ్యక్తి పేరుతో ఓట్లు తొలగించాలని దరఖాస్తులు ఇచ్చారు. వైసీపీ నేతలు ప్రత్యక్ష ప్రమేయం ఉంది.
అధికారులు చెక్ చేయకపోతే తప్పులు జరుగుతాయి. తర్వాత అధికారులుబబాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈసీ దృష్టికి తీసుకువెళ్తాం
వైసీపీ చీప్ ట్రిక్స్ ను సమర్ధనంతమగా ఎదుర్కొంటామ్. ప్రజలకు అన్ని అంశాలు తెలుసు. వైసీపీ యత్నాలను తిప్పికొడతారు.
ఎలాగయినా అధికారంలోకి తేవాలని టీఆరెస్ ప్రయత్నిస్తోంది. పాము కి పాలు పోసినా ఏదో ఒకరోజు కాటు వేస్తోంది.
మోడీ, కేసీఆర్, జగన్ కుట్రలు, కుతంత్రాలు తిప్పికొట్టి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.
ఐటీ గ్రిడ్ సంస్థ మా పార్టీ ఐటీ సేవలకు పని చేస్తోంది. విజయ్ సాయి ఫిర్యాదు చేయడం ఏంటి..తెలంగాణ ప్రభత్వం చర్యలు తీసుకోవడం ఏంటి.
ఇది టీఆరెస్ , వైసీపీ ఫెవికాల్ బంధానికి నిదర్శనం. ఐటీ గ్రిడ్ చేసిన తప్పేంటి.
ఎక్కడ పోటీ చేసేది ముందుగా నేను ఎప్పుదు చెప్పలేదు. భీమిలికోసం నేను వర్క్ చేసుకున్నా. సీఎం కి కూడా చెప్పా. అధిష్టానం ఏం చెప్పినా చేస్తా.
భీమిలిలో మళ్ళీ పోటీ చేయాలన్నది నా వ్యక్తిగత అభిప్రయమ్