జరిగిన సంఘటనలు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వివరణ ఇవ్వాల్సి మన బాధ్యత నా పై ఉంది
ఆంక్షలు లేని ప్రజా జీవితం ఆకాంకించాను.. కానీ వైసిపి లో సాద్యం కాలేదు
సొంత తమ్ముడిలా చూసుకుంటూ, రంగా ఆశయాలను నెరవేరుస్తానని చెప్పిన జగన్ మాట మార్చారు
ఆయన మాట తప్పడమే కాదు.. ఆ పార్టిలో నాకు అనేక అవమానాలు జరిగాయి
నా తండ్రి విగ్రహం ఆవిష్కరణ కు వెళ్లడానికి నాకు ఎవరి అనుమతి అక్కర్లేదు
రంగా గారికి పార్టీ లతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు
వారు ఆహ్వానిస్తే నేను వెళ్లకూడదని నా పై ఆంక్షలు విధించారు
ఎవరికి చెప్పావు, ఎందుకెళ్లావు, నా పార్టిలో నాకు నచ్చినట్లు ఉండాలి అని జగన్ అన్నాడు
తండ్రి లేని బిడ్డ వి అని జాలి చూపిస్తుంటే.. నేను చెప్పినట్లు వినవా అని జగన్ అన్నాడు
రంగా మీద అభిమానం తో నే ఆయన బిడ్డగా నాపై అభిమానం చూపిస్తున్నారు
నాకే న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఇంకా ఏమి చేస్తారు
రంగా అభిమానులను ఇప్పటికైనా జగన్ గౌరవించాలి
వైసిపి ఆధ్వర్యంలో సోషల్ మీడియా వేదికగా నా పై బెదిరింపులకు దిగుతున్నారు
చివరకు చంపేస్తామన్న వాళ్లు.. వచ్చి చంపేసుకోండి.. నేను తాడు బొంగరం లేని వాడిని
వీటి పై కేసు పెడితే ఎవరెవరు ఈ బెదిరింపులు ల వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తుంది
జగన్ ఎపి పోలీసులు పై నమ్మకం లేదోమో కానీ.. నాకు ఉంది
ఎమ్మెల్యే ఏమి పీకుతాడని అంటున్న జగన్ ప్రజలకు ఏమి చేస్తాడు
సెప్టెంబరు లో నన్ను అభిమానం గా గెంటేశారు.. అయునా ఇష్టం వచ్చినట్లు వైసిపి నేతలు మాట్లాడుతున్నారు
ఒక్క సీటు విషయంలో కనీసం నాతో మాట్లాడలేక పోయావు
తమ్ముడన్నావు.. పార్టీ అధినేతగా ఉన్నావు.. ఇదే నా నీ మర్యాద
యలమంచిలి రవి ని పార్టీ లోకి తీసుకురమ్మన్నారు.. ఇప్పడు నన్నే గెంటేశారు
రాధా ఇన్ మెటీరియల్ అవ్వొచ్చేమో గానీ.. రంగా ఎప్పటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా ఉంటాడు
జగన్ రంగా కు అభిమానులు లేరనే భ్రమల్లో ఉన్నారు..అది నిజం కాదు
కొంతమంది వెధవలు వంద కోట్లు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు.. వాటిని నేను పట్టించుకోను
నాకు నా తండ్రి రంగా ఆశయాలు ముఖ్యం.. అవి సాధించడమే నా జీవితాశయం
నేను ఏ పార్టి లో ఉన్నా నా వాళ్లను, రంగా అభిమానులను కాపాడుకోవడం నాబాధ్యత
వివిధ పార్టిలలో ఉన్నప్పుడు ఆయా పార్టిల సిద్దాంతాలకు అనుగుణంగా మాట్లాడతాం
కానీ రంగా కు అన్ని పార్టీ లలో అభిమానులు ఉన్నారనేది గుర్తించక పోవడం మా తప్పే
నా నోటి నుంచి ఎటువంటి ప్రకటనలు రాకుండానే నాపై మాటల దాడి చేశారు
ఎపి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సాదరంగా నన్ను ఆహ్వానించారు
నా తండ్రి ఆశయమే ముఖ్యం.. నన్ను ఎవరెన్ను అనుకున్నా వారిష్టం
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిఎం ను కోరుతున్నా.. పెద్ద మనిషిగా ఆలోచించి అమలు చేస్తారని భావిస్తున్నా
సిఎం పెద్ద మనసుతో పరిస్థితి అర్దం చేసుకుని నన్ను మన్నించాలి అని కోరుకుంటున్నా
ముప్పై యేళ్లుగా అన్ని పార్టీ లలో ఉన్న నేతలు రంగా పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు
రంగా విగ్రహావిష్కరణ కు వెళితే .. ఎందుకు వెళ్లావని జగనే స్వయంగా నన్ను ప్రశ్నించారు
వైయస్ విగ్రహం కూలకొడితే.. కొడుకుగా, వైసిపి అధ్యక్షుడు గా జగన్ కనీసం పట్టించుకోలేదు
నువ్వా నా గురించి మాట్లాడేది.. నా తండ్రి ఆశయం కోసం అన్నీ భరిస్తే చేతకానివాడిగా చూశారు
సిఎం గారు.. పేదలకు పట్టాలు ఇచ్చి నా తండ్రి ఆశయాలను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరుతున్నా

















