నందిగామ మరియు కంచికచర్ల ప్రాంతాలలో విపరీతమైన మంచు కురుస్తుండడంతో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి వెలుతురు సరిగా లేనందున లైట్లు మరియు సిగ్నల్స్ వేసుకొని నెమ్మదిగా వెళ్ళ వలసిన పరిస్థితి కనిపిస్తుంది ద్విచక్ర వాహన దారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది వస్తున్న వాహనం సమీపంలో వచ్చేంతవరకు ఆనవాళ్లు కనపడకపోవడంతో వారి పరిస్థితి ప్రాణసంకటంగా మారింది…
తెల్లవారుజామున వ్యాపార నిమిత్తం వెళ్లే చిరువ్యాపారులు తోపుడు బళ్ల వ్యాపారులు ఈ మంచు కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారు
కేసర టోల్ ప్లాజా వద్ద పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొగ మంచులో వాహనాలు సరిగా కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి….
దూర ప్రాంతాల నుంచి వస్తున్నామని పొగమంచు చాలా దట్టంగా ఉందని రహదారి సరిగ్గా కనిపించట్లేదని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు తెలిపారు

















