మునగపాక మండలం ఉంపాల గ్రామంలో శ్రీ షిర్డీ సాయిబాబా మహోత్సవాలు సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పరసా ఏర్పాటు చేశారు ఈ పరసా లో ప్రత్యేకత బైక్ రేసింగ్, సైకిల్ పోటీలు, గుర్రపు స్వారీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉంపాల గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో అతి ముఖ్యమైన, పెద్ద పండుగ సంక్రాంతి యెనని ప్రతి రైతు ఆనందోత్సవాలతో బంధుమిత్ర సపరివార అందరితో కలిసి చేసుకునే ఏకైక పండుగ సంక్రాంతి అన్నారు. షిరిడి సాయి బాబా మహోత్సవం మరియు సంక్రాంతి సంబరాలను ఈ మూడు రోజులు ప్రతియేటా ఆడంబరంగా నిర్వహిస్తున్నామని అయితే ఈ సంవత్సరం ఒంగోలులో గిత్తల పోటీలు నిర్వహిస్తుండటం మనకు తెలిసిందే దానికి దీటుగా గ్రామం లో కూడా ఉంపాల గ్రామంలో కూడా యువకులకు బైక్ రేసింగ్ సైకిల్ రేసింగ్ ఆడవారికి ముగ్గుల పోటీలు చిన్న పిల్లలు ఆడుకోవడానికి రంగులరాట్నం ఇలాంటివి చాలా ఏర్పాటుచేశామని వీటితోపాటు ప్రత్యేకంగా గుర్రపు స్వారీ లను ఏర్పాటు చేశామని గ్రామ ప్రజలే కాక మునగపాక మండలం వారు పక్క మండలాల్లో నుంచి కూడా అత్యధికంగా ప్రజలు పాల్గొన్నారని గుర్రపు స్వారీ మొదటి బహుమతిగా పదివేల రూపాయలు రెండవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు మూడవ బహుమతిగా వేల రూపాయలు బహుమతి అందించామని ఈ సందర్భంగా తెలియజేశారు.

















