క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతిని కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఉదయం పూజలు, ఆ తర్వాత గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన తర్వాత కాసేపు మనవడు దేవాన్ష్‌తో కలిసి సందడి చేశారు. తాతా, మనవడు ఇద్దరూ కలిసి ఎడ్లబండి ఎక్కారు. ముఖ్యమంత్రి అయ్యాక క్షణం తీరిక లేకుండా చంద్రబాబు గడుపుతున్నారు. ఒక్కోసారి కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అవకాశం కూడా లేకుండాపోతోందని ఆయన పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కాస్త తీరిక దొరకడంతో మనవడుతో చంద్రబాబు ఎడ్లబండిపై నారావారిపల్లెలో షికారు చేశారు. తాత నిలబడి బండినడుపుతుంటే.. మనవడు కూర్చోని హల్ చల్ చేశాడు. మనవడు ఉత్సాహాన్ని చూసి తాత కూడా సంబరపడ్డారు. ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మరిచిపోయి ఎంజాయ్ చేశారు.