నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ధనుర్మాసం ఉత్సవములలో భాగంగా శనివారం గోదాదేవి అమ్మవారికి తోటోత్సవం మూడవ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. .
దీనిలో భాగంగా ఆలయంలో నిత్య కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను దేవాలయం ప్రాంగణంలో గల పుష్ప తోటలోకి తీసుకుని వెళ్ళి అక్కడ తిరువారాధన, ప్రసాద నివేదన, తిరుప్పావై సేవాకాలం, ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుప్పావై ఇరవై ఎనిమిదవ రోజు ” కఱవై గళ్ పెన్ శెన్ఱు ” పాశురంతో ప్రత్యేక నీరాజన మంత్రపుష్పాలు తీర్ధగోష్ఠి ప్రసాదవినియోగం నిర్వహించారు.
అనంతరం గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీలోనూ స్వామివారి ఉత్సవమూర్తులను ఇత్తడి గరుడ వాహనంలో వేంచేపు చేసి గ్రామంలోతిరువీధిసేవ నిర్వహించారు.
ప్తిశనివారం నిర్వహించే అన్నదానం కార్యక్రమం తిరువీధిసేవ అనంతరం నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనకాపల్లి కోర్టు ఏడీఎమ్ జాస్తి సత్యనారాయణ మూర్తి, యలమంచిలి కోర్ట్ సివిల్ జడ్జి బుల్లి కృష్ణ దంపతులు గరుడాద్రి పర్వతం మీద కొలువైన వేంకటేశ్వర స్వామి వారిని కొండదిగువున గల ఉత్సవమూర్తులను దంపత సమేతంగా దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు ప్రత్యేక దర్శనంతో పాటు తీర్ధ ప్రసాదాలు ఆండాళ్ అమ్మవారి మూలవిరాట్ సన్నిధి వద్ద ఆశీర్వచనం చేసారు.
ఈకార్యక్రమంలో అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పి.శేషాచార్యులు, బి.హెచ్. ఎస్. గోపాలాచార్యులు, ఇల్లింద గోపాలాచార్యులు, నండూరి రంగాచార్యులు , దేవస్థానం సిబ్బంది బి.వి. జీ. రాజశేఖర్ గ్రామానికి చెందిన శ్రీనివాసా భక్త సమాజం సభ్యులు మీగడ ఈశ్వరరావు పలువురు భక్తులు పాల్గొన్నారు.


















