Heroine Anu Emmanuel Inaugurates
MGR Shopping Mall in Chittoor,Vizag Vision..చిత్తూర్ నగరంలో తారల తళుకుల మధ్య ఎం జి ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఎం జి ఆర్ షాపింగ్ మాల్ అధినేత గిరిధర్ ఉదయం కథానాయకులు అను ఇమ్మానుయేల్, జబర్దస్త్ ఫేం యాంకర్ రేష్మి గౌతమ్
దీప్తి తదితరులుజ్యోతి వెలిగించి , షాపింగ్ మాల్ సందర్శించి మాల్ లో కొనుగోలు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ లో సందడి నెలకొంది సినీ తారల చూసేందుకు సెల్ఫీలు తిరిగేందుకు యువత పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కొంత తొక్కిసలాట జరిగింది. ప్రారంభంలో దీప్తి యాంకరింగ్ యువత నృత్యంతో యువకులు హోరెత్తించారు. ఈ సందర్భంగా చర్చి వీధిలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అదుపులో ఉంచేందుకు ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్తూరు పట్టణంలో ఎం జి ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు పట్టణ ప్రజలు సహనంతో ఉండి ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని షాపింగ్ మాల్ అధినేత గిరిధర్, మేనేజర్ ప్రసాదు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు…