“Visakha Utsav” -18 Ap Cm Inaugurates at RK Beach in Visakhapatnam,Vizag Vision..ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ.10 వేల ఆదాయం సమకూర్చాలి అన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ లక్ష్యం సాకారం అయ్యేందుకే పెద్ద ఎత్తున అభివృద్ధి , సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. శుక్రవారం అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పనిముట్లు ఆస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ఆర్థిక అసమానతలను రూపుమాపి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని లక్ష్యంతో గత నాలుగేళ్లలో పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆదరణ, ఎస్సీలకు ముందడుగు, ఎస్టీలకు చైతన్యం, వికలాంగులకు చేయూత, ముస్లింలకు రోషిని తదితర పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. ఆధునిక పనిముట్లు పంపిణీకి ఒకటి , రెండు విడతల ఆదరణ కార్యక్రమాలను విజయవాడ, తిరుపతి లో భారీ స్థాయిలో నిర్వహించామని , ప్రస్తుతం అనకాపల్లిలో మూడు విడత ఆదరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ మూడు విడతల్లో రూ.3 వేల కోట్లను వెచ్చిస్తూ 6 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం జరుగుతున్నదన్నారు.
మరో 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా జనవరిలో నాలుగో విడత ఆదరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ కల్పించేందుకు పెద్ద ఎత్తున గృహ నిర్మాణ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. 2022 కల్లా ప్రతి ఒక్కరికి శాశ్వత గృహ వసతి కల్పిస్తామని ఆయన తెలిపారు. జనవరిలో నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలో గృహాలు కావాల్సిన వారందరి నుండి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, గృహాలు మంజూరు చేస్తున్నామన్నారు. విద్యా వైద్య ఆరోగ్య పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామన్నారు. 24 రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి వైద్య ఖర్చులను చాలా వరకు తగ్గించామన్నారు. పరిశ్రమల స్థాపనకు 15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని, 30 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీరి ఉత్పత్తులకు ప్యాకింగ్, మార్కెటింగ్ , వేర్ హౌసింగ్ సౌకర్యాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. కుల వృత్తుల ఉత్పత్తుల కూడా వీటి ద్వారా మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

















