కుటుంబాన్ని త్యాగం చేసి రాష్ట్ర ప్రజలకోసం శ్రమిస్తున్నా: బాబు,..అనంతపురం
కుటుంబాన్ని త్యాగం చేసి రాష్ట్ర ప్రజలకోసం శ్రమిస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. కొంతమంది కులం, మతం పేరుతో రెచ్చగొట్టి గెలవాలనుకుంటున్నారని, కులంతో ఎవరూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాలేరన్నారు. ప్రజలకు మంచి చేస్తేనే పదవులు వస్తాయని గుర్తుచేశారు. విద్యాసంస్థలకు భూములిచ్చినా నిర్మించడంలేదని ఆరోపించారు. విమానాశ్రయాల విస్తరణకు అనుమతులు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడంలేదని విమర్శించారు. తెలుగురాష్ట్రాలు కలిసి పనిచేద్దామంటే… అటు కేంద్రం, ఇటు తెలంగాణ సహకరించడంలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు ఇక్కడి ప్రతిపక్షం సహకరిస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడి ప్రతిపక్షాలు సంబరాలు చేసుకున్నాయని బాబు విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గ ప్రభుత్వాన్ని చూడలేదని, మోదీని ఎంతో గౌరవించా, ఆయన కనికరించలేదని మండిపడ్డారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా రాష్ట్ర సమస్యలు పరిష్కారం కాలేదని చంద్రబాబు ఆరోపించారు.