కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కన్నుమూత
కన్నడ ప్రముఖ నటుడు రెబల్ స్టార్ అంబరీష్ బెంగళూరు లో తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
1952 మే 29న అప్పటి మైసూర్ రాష్ట్రంలోని మండ్యలో జన్మించారు.సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయ లో కూడా తనదైన ముద్ర వేశారు. యూపీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ లో సమాచారశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.
అంబరీష్ భార్య సుమలత తెలుగు ఇండస్ట్రీలో సుపరిచితమే. అంబరీష్ మృతి పై ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.సూపర్ స్టార్ రజినీకాంత్,మాజీ కేంద్రమంత్రి సదానందగౌడ తదితరులు సంతాపం తెలిపారు.