Amma Creations”Nenu Nenuga Lene”Independent Film in Visakhapatnam,Vizagvision..అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై పొలమరశెట్టి రాయప్పరాజు నిర్మాణ సారధ్యంలో రాజ కిరణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండిపెండెంట్ ఫిల్మ్ “నేను నేనుగా లేనే.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలతో పాటూ ఓ మంచి ప్రేమకధతో తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఉర్విజ జయరామన్ కథానాయకగా నటిస్తోంది.
బాలు రాజ్, వైబ్రేషన్స్ రాజేష్, పి.వి.విజయ ప్రసాద్, ప్రవీణ్, రాజేష్, మాధవి, యం. సూర్యారావు, జి.రాంబాబు తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకి ప్రేంచంద్ కంచర్ల సంగీతం అందిస్తున్నారు.
ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ లో హైలెట్ ఏంటంటే దర్శక నిర్మాతలు నటీటులు టెక్నీషియన్స్ ఇలా అందరూ విశాఖపట్నానికే చందినవారు కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ కొత్తగా ఏర్పడిన తర్వాత నిర్మితమవుతున్న మొట్టమొదటి ఇండిపెండెంట్ ఫిల్మ్ నేను నేనుగా లేనే.
ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభమయ్యే షూటింగ్ మొత్తం విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాలలో జరగనుంది.
సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసుకోనున్న ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ పూజా కార్యక్రమాలు అక్కయ్యపాలెం లో ఉన్న అమ్మ క్రియేషన్స్ ఆఫీసులో
వై.ఎస్.ఆర్.పి నగర అధ్యక్షులు శ్రీ మళ్ళ విజయప్రసాద్ గారి చేతులు మీదుగా నిన్న జరిగాయి. ఈ కార్యక్రమంలో కె.ఎన్.ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత కరణం రెడ్డి నర్సింగరావులతో
పాటూ చిత్ర నటీనటులు సాంకేతిక బృందం పాల్గొంది.
సంగీతం : ప్రేంచంద్ కంచర్ల
కొరియోగ్రాఫర్ : జాకీ
సినిమాటోగ్రఫీ : శ్రీమన్నారాయణ
ప్రొడక్షన్ మేనేజర్ : పి.వి.విజయప్రసాద్
నిర్మాత : పొలమరశెట్టి రాయప్పరాజు
కథ,మాటలు,దర్శకత్వం : రాజ కిరణ్