Latest News
- Visakhapatnam Vizag vision: ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం సందర్భంగా AI ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ప్రారంభించిన ఫెర్టీ9ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో మొట్టమొదటిసారిగా, ప్రత్యేకమైన లెన్షూక్ ఎక్స్12 ప్రో ఆవిష్కరణవైజాగ్, జూలై 25: ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఫెర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్ వైజాగ్ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, అత్యాధునిక AI ఆధారిత సెమెన్ ఎనలైజర్, లెన్షూక్ ఎక్స్12 ప్రో ను పరిచయం చేస్తూ, సంస్థ సంతానోత్పత్తి సంరక్షణ రంగంలో తన నూతన దిశను ప్రకటించింది. ఈ ఆవిష్కరణతో, సంస్థ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని తన అన్ని కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసిన తొలి ఐవిఎఫ్ చెయిన్‌గా నిలిచింది. ఇది ఖచ్చితమైన రోగనిర్ధారణ మరియు సమగ్ర పునరుత్పత్తి సంరక్షణ పట్ల దాని నిబద్ధతను బలోపేతం చేస్తుంది.ఫెర్టీ9 సహాయంతో గర్భధారణకు చేరుకొని విజయవంతంగా బిడ్డలను పొందిన జంటలు ఈ వేడుకలో పాల్గొని, తమ ప్రయాణాలను పంచుకుంటూ, ఆశను పునరుజ్జీవింపజేసే తమ స్వంత కథలను అందించారు. “#టుగెదర్ ఇన్ ఐవిఎఫ్” ప్రచారానికి ప్రాతినిధ్యంగా నిలిచిన ప్రతీకాత్మక కేక్ కటింగ్ వేడుక, సంఘీభావాన్ని, సమిష్టి ఆశయాన్ని చాటి చెప్పింది.భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) జనాభా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన స్థాయి అయిన 2.1 కంటే తక్కువగా 1.9కి తగ్గిన నేపథ్యంలో, ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంఖ్యలు తక్కువగా ఉండి, వరుసగా 1.7 మరియు 1.8కి చేరాయి. ఈ స్థితిలో, సమగ్ర మరియు సమానమైన సంతానోత్పత్తి సంరక్షణ అవసరం మరింత కీలకంగా మారింది – ముఖ్యంగా పురుషుల వంధ్యత్వం వంటి కీలక అంశాలను గుర్తించి, వాటిపై సమగ్రంగా స్పందించే అత్యవసరత ఇప్పుడు ఎప్పటికన్నా ఎక్కువగా ఉంది.”DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ (DFI) స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భస్రావం రేట్లు 20–25 శాతానికి పెరిగే ప్రమాదం ఉంది, అంతేకాకుండా దీనితో పాటు తక్కువ జనన బరువు మరియు ముందస్తు పుట్టుకల అవకాశాలు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు,” అని డాక్టర్ Y. సృజన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టీ9 తెలిపారు. “ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, మనం నిమిషాల వ్యవధిలోనే వేలాది వీర్యకణాలను విశ్లేషించగలుగుతాము. డిఎన్ఎ సమగ్రతను ఖచ్చితంగా అంచనా వేసి, మరింత సమాచార ఆధారిత చికిత్సా ఎంపికలు చేయడం సులభమవుతుంది. దీని ద్వారా అధిక నాణ్యత గల వీర్యాన్ని గుర్తించడానికి, పిండం అభివృద్ధిని మెరుగుపరచడానికి మరియు సంతానోత్పత్తి చికిత్సల విజయశాతం పెంచడానికి మాకు గణనీయమైన తోడ్పాటు లభిస్తుంది,” అని ఆమె వివరించారు.పురుషుల వంధ్యత్వానికి కీలకమైన అంశంగా స్పెర్మ్ నాణ్యత నిలుస్తున్నప్పటికీ, సాంప్రదాయ పరీక్షలు తరచుగా అంతర్గతంగా ఉన్న DNA నష్టాన్ని గుర్తించలేవు. సూక్ష్మదర్శినిలో సాధారణంగా ఆరోగ్యంగా కనిపించే స్పెర్మ్ కూడా విచ్ఛిన్నమైన DNAను కలిగి ఉండే అవకాశముంది, ఇది ఫలదీకరణం, పిండం అభివృద్ధి మరియు గర్భధారణ విజయాన్ని ప్రభావితం చేయగలదు. మాన్యువల్ టెస్టింగ్ పద్ధతులు కూడా మానవ లోపాలు మరియు పరిమిత సామర్థ్యాల వంటి అవరోధాలకు గురవుతాయి.ఫెర్టీ9 లెన్షూక్ X12 PRO ను స్వీకరించడం ఈ క్లిష్టమైన రోగనిర్ధారణ అంతరాన్ని తగ్గిస్తుంది. ఈ విప్లవాత్మక ప్లాట్‌ఫామ్ కేవలం ఆరు నిమిషాల్లో ప్రతి నమూనాలో 3,000 వీర్య కణాలను విశ్లేషించగలదు. గణన, చలనశీలత, ఆకృతి మరియు DNA సమగ్రతపై ఖచ్చితమైన వివరాలు అందిస్తూ. సింగిల్ మరియు డబుల్-స్ట్రాండ్ DNA విచ్ఛిన్నాలను గుర్తించే సామర్థ్యంతో, పిండశాస్త్రవేత్తలు అత్యుత్తమ వీర్యాన్ని ఎంపిక చేయగలుగుతారు. ఇది IVF వైఫల్యాలను తగ్గించడంలో, గర్భధారణ విజయాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.“సంతానోత్పత్తి సమస్యలలో మగవారి వంతు సగానికి అనగా 50% సమానం కాగా, తొలి సంప్రదింపులలో 95 శాతం వరకు మహిళలచే ప్రారంభమవుతున్నాయి,” అని డాక్టర్ కావ్య రెడ్డి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఫెర్టీ9. ఈ అసమతుల్యతకు ఇప్పుడు మార్పు అవసరం. మేము ప్రవేశపెట్టిన అత్యాధునిక రోగనిర్ధారణ వ్యవస్థతో, మేము సంతానోత్పత్తి సంరక్షణను మరింత సమగ్రంగా, డేటా ఆధారితంగా పునర్నిర్మాణం చేస్తున్నాము. ఇటువంటి సాంకేతికతలు అనవసరమైన చికిత్సలను తగ్గించడమే కాక, భావోద్వేగ మరియు ఆర్థిక ఒత్తిడిని కూడా తగ్గించగలవు, తద్వారా దాని వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారాలతో దంపతులకు నిజమైన ఆశను అందించగలవు.#టుగెదర్ఇన్IVF ప్రచారానికి అనుగుణంగా, ఫెర్టీ9 పరిమిత కాలం కోసం జంటలకు ప్రత్యేక సంతానోత్పత్తి అంచనా ప్యాకేజీని కేవలం ₹599 వద్ద అందిస్తోంది. ఇందులో సంతానోత్పత్తి సూపర్ స్పెషలిస్ట్‌తో సంప్రదింపులు, అల్ట్రాసౌండ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు చేర్చబడ్డాయి. అలాగే, జూలై 31, 2025 లోపల చికిత్స ప్రారంభించగల జంటలకు, ఐయుఐ చికిత్సపై 50% మరియు ఐవిఎఫ్ పై 25% రాయితీ కూడా లభిస్తుంది.ఈ ప్రారంభంతో, ఫెర్టీ9 సంతానోత్పత్తి సంరక్షణ రంగంలో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. సానుభూతి, ఖచ్చితత్వం మరియు AI ఆధారిత పరిజ్ఞానం యొక్క సమన్వయంతో, మెరుగైన ఫలితాలను అందించడం పట్ల సంస్థ దృఢంగా కట్టుబడి ఉంది.
- రాబోయే వారం రోజులు చెదురు మదురు వర్షాలు #vizagvision #ytshots
- Vizagvision: పాలకొండ రిజిస్టర్ పై చర్యలు తీసుకోవాలి బాధితుడు సత్యనారాయణమూర్తి ఆవేదన Visakhapatnam
- Vizagvision: కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం కుంకుమ పూజలు in Visakhapatnam
- శ్రావణ శుక్రవారం కుంకుమ పూజలు కన్యక పరమేశ్వరి దేవాలయం#vizagvision #ytshots
- శ్రావణ శుక్రవారం కుంకుమ పూజలు కనకమాలక్ష్మి దేవాలయంలో #vizagvision #ytshots
- Vizagvision: ఘనంగా కనకమహాలక్ష్మి శ్రావణమాసం కుంకుమ పూజలు విశాఖపట్నం
- Vizag Vision:Cheating Case Recovery CP Dr.Shankhabrata Bagchi Press Meet in Visakhapatnam
- VizagVision: Divis Laboratories Donates Rs 3.21Crore CSR Funds to Andhra University in Visakhapatnam
- విశాఖలో చల్లని వాతావరణంలో చిరుజల్లులు #vizagvision #ytshots
ఇతగాడి వారసుడు హీరోగా వస్తే చేతికి చిప్పే ఇంకా..!!
on: In: EntertainmentTags: Gali Janardan Reddy Daughter Marriage, Gali Janardhan Reddy son, Gali Janardhan Reddy Son Dance, Gali Janardhan Reddy son Introducing to industry, Gali Janardhan Reddy's son Kiriti dance in Function, Gali Janardhanreddy, Gali Janardhanreddy Son Keerti Reddy, Gali Janardhanreddy Son Keerti Reddy Entry to The Industry Soon, Gali Keerti Reddy, Tamanna with Gali Janardhan Reddy son
Related Articles
-
-
-