నైరుతి బంగాళాఖాతంలో ఉపరితలద్రోణి బలహీనపడింది. అయినప్పటికీ బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడకక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తూర్పుగాలుల తీవ్రత తగ్గడంతో రాష్ట్రంలో పలుచోట్ల చలి పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో శివారు ప్రాంతాల్లో మంచు కురడంతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఆరోగ్యవరంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గనున్నాయి.

















