పోర్టులో బెర్తుల ప్రైవేటు పరం నిలుపుదల చేయాలి పోర్ట్ నిర్వహణలోనే బెర్తుల నిర్మాణం జరగాలి in Visakhapatnam,Vizagvision…పోర్టులో బెర్తుల ప్రైవేటు పరం నిలుపుదల చేయాలి…
పోర్ట్ నిర్వహణలోనే బెర్తుల నిర్మాణం జరగాలి….
విశాఖపట్నం:- విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఇటీవల జరిగిందని ఇందులో ప్రధానంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలు ఏవి చర్చించకుండా పోర్ట్ స్థలాలు లీజుకివ్వడం, బెర్తుల నిర్మాణం ప్రయివేటు వారికి అప్పజెప్పడం వంటి అంశాలు ఉన్నాయని విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులు జె వి సత్యనారాయణ మూర్తి, యూనియన్ ప్రధాన కార్యదర్శి bch మసేన్ లు పేర్కొన్నారు.
బుధవారం యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. పోర్టులో మొత్తం 27 బెర్తులంటే అందులో 12 బెర్తులను బిఓటి, పీపీపీ, dbfo పద్దతులలో ప్రయివేటు వారి నిర్వహణలో ఉన్నాయని గుర్తు చేస్తూ eq 1 బెర్తను ఎస్. ఈ. డబ్ల్యూ అనే కంపిణికి కేతహించారని మధ్యలో ఆ కంపెనీ పనినిలుపుడల చేశారని పేర్కొన్నారు. అలాగే మరో కంపెనీ కి eq 2 బెర్త్ నిర్మాణం పనులను కేతహించగా వారుకుడా పనులు నిలుపుదల చేశారని ఆరోపించారు. ఇలా పనులు నిలిపెడ్తూపోతే మరల పోర్టు పనులు చేస్తువస్తోందని,అలాగే WQ 6లో ఆల్బ కంపిణికి బెర్తు నిర్మించాలని పనులు కేతాహిస్తే వారు కొద్దిరోజులు చేసి నిలుపుదల చేశారని… ఇలా అన్ని పనులు మధ్యలో ఆపేస్తే పోర్టు కు ఎంతో నష్టం వతిలుతుందని పేర్కొన్నారు. ప్రయివేటు కంపిణీల నిర్వహణలో జరుగుతున్న బెర్తుల నిర్వహణ సక్రమంగా లేదని కావాలనే నష్టాలు చూపుతూ పోర్టు ఆదాయానికి గండి కోడుతున్నారని ఆరోపించారు. ప్రయివేటు విధానాలకు స్వస్తి పలికి పోర్టు నిర్వహణలోనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో యూనియన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
















