Fans Died Trying to Fix Flexi Janasena,Visakhapatnam,Vizag Vision..[7:10 PM, 6/6/2018] DEVA TRINADH RAO: విశాఖజిల్లా, పాయకరావుపేట లో కరెంట్ షాక్ తగిలి ఇద్దరుమృతి.మృతులు భీమవరపు శివ,బోలెం నగరాజులుగా గుర్తింపు.
[7:10 PM, 6/6/2018] DEVA TRINADH RAO: విశాఖజిల్లా, పాయకరవుపేటలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా కరెంటు వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం.ఎస్.ఐ. చెప్పిన వివరాల ప్రకారం ఈ నెల 7వ తేదీన పాయకరావుపేటకు రానున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు 30 అడుగుల ఫ్లెక్సీని చేయించి,సూర్యమహల్ సెంటర్లో ఓ బిల్డింగ్ వద్ద నిలబెట్టే ప్రయత్నంలో ఆ ప్రక్కనుండే వెళ్లే 33kv.కరెంట్ వైర్లు ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్ కి తగలడం తో ఫ్లెక్సీ పట్టుకున్న భీమవరపు శివ,తోలెం నాగరాజు ఇద్దరూ కరెంటు షాక్ తగిలి మృతి చెందారు.వీళ్ళ అభిమానమే వీళ్ళ ప్రాణం తీసిందని ప్రజలు వాపోతున్నారు.
[7:10 PM, 6/6/2018] DEVA TRINADH RAO: భీమవరపు శివ పాయకరావుపేట నగరాజుపేట చెందిన రజిక కుటుంబం వాడు.ఇతనే వాళ్ల కుటుంబానికి ఆధారం.ఇతను చిన్న కాయకూరలు వ్యాపారం చేస్తుంటాడు.ఇతని సంపాదన మీదే కుటుంబం ఆధారపడివుంది.ఇతనికి నాలుగు నెలల వయసున్న బాబు,భార్య,తండ్రి,తల్లి ఉన్నారు.తండ్రికి షుగర్ వ్యాధి రావడంతో పనికి వెళ్లలేడు, తల్లికి అనారోగ్యం.శివ హటాత్మరణ వార్త విని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు.పసిగుడ్డు తో భార్య విలవిలాడిపోయింది.కుటుంబానికి దిక్కే శివ అలాంటి శివే లేడు అని తల్చుకుంటేనే భయానికి గురౌతున్నారు కుటుంబసభ్యులు.ఆ క్వాలని అంతా విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
తొలం నాగరాజు తుని లో చిన్న బడ్డి పెట్టుకుని జీవనం సాగించేవాడు.ఇతనికి ముగ్గురు కుమారులు.వీళ్ళు చిన్న పిల్లలు.నాగరాజు తుని లో తారకరామా క్వాలనికి చెందినవాడు.ఇతనే కుటుంబానికి పెద్దదిక్కు.నాగరాజు మరణవార్త విని కుటుంబం కుప్పకూలిపోయింది.ఆ క్వాలని అంత విషాదం కమ్ముకుంది.
వీళ్లిద్దరూ పవన్ కల్యాణికి వీరాభిమానులు.వాళ్ళ అభిమాన నాయుడిది ఏ సినిమా వచ్చిన ఒక పండగల జరుపుకునేవారు.అలాంటి వీరికి అభిమాన హీరో ఫ్లెక్సీ నిలబెట్టడం తోనే వాళ్ళ ప్రాణాలు ఆనంతలోకంలోకి కలిసిపోయాయి