Pawan Kalyan Message to all Fans,Vizag Vision…టాలీవుడ్లో నటి శ్రీరెడ్డి లేవనెత్తిన క్యాస్టింగ్ కౌచ్ దుమారం.. అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో భాగంగా శ్రీరెడ్డి పవన్ను దూషించడం.. ఇలా దూషించమని చెప్పింది తానేనని దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక టీడీపీ అనుకూల మీడియా, లోకేశ్ కుట్ర ఉందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.
అశ్లీలాన్ని, నగ్నత్వాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ.. మన తల్లులు, కుమార్తెలు, అక్కచెల్లెళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లను బహిష్కరించాలని పవన్ అంతకుముందు ట్వీట్ చేశారు. సంబంధం లేని విషయాల్లోకి తనను లాగి, తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హస్తం ఉందని ఆరోపించారు.