Chakrasanam Mahotsavam Sri Varaha lakshmi narasimha swamy Simhachalam,Vizagvision,Visakhapatnam..సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి ఆలయంలో వార్షికకళ్యాణమహోత్సవలలో భాగంగ చక్రస్నానం మహోత్సవం వేడుకుగా నిర్వహించారు.ముందుగా స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కోపి ప్రత్యేకపూజలు నిర్వహించారు.అనంతరం విశేషహోమలు మహపూర్ణహుతి అనంతరం చూర్ణోత్సవం , వసంతోత్సవం అవబృదోత్సవం శాస్రోత్తంగ నిర్వహించారు.అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిల్లలో అధిష్టింపచేసి గంగదార వద్దకు మేళతాళలు మంగళవాయిద్యల నడుమ తోడ్కోని పోయి మండపంలో విష్వక్సేన ఆరాదన , పుణ్యహవాచనం వంటి ప్రత్యేకపూజలు నిర్వహించి చక్రపెరుమాళ్ళుకు చక్రస్నానం మహోత్సవం నిర్వహించారు.ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గున్నారు.