కళా వెంకట్రావు గారి అరెస్ట్ జగన్ రెడ్డి రాక్షసత్వానికి నిదర్శనం అని టీడీపీ విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని స్వచ్ఛమైన నాయకుడు కళావెంకట్రరావు గారిని అన్యాయమైన కేసులో ఇరికించి అక్రమంగా రాత్రి అరెస్ట్ చేయడం దారుణం అని అన్నారు…. దేవాలయాల దాడులపై తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతోనే అరెస్ట్ చేశారు… టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు… దేవాలయాలపై దాడులు చేసిన వారిని వదిలేసి.. ప్రశ్నించిన వారిపై జగన్ రెడ్డి తన దమనకాండను కొనసాగిస్తున్నారు… చంద్రబాబునాయుడు గారి రామతీర్థం పర్యటన రోజే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఏవిధంగా అనుమతిచ్చారు? కళా వెంకట్రావు గారి అరెస్ట్ జగన్ రెడ్డి రాక్షసత్వానికి నిదర్శనం. రాష్ట్రాన్ని మరో బీహార్ గా మార్చేందుకు జగన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. దేవాలయాల దాడులపై తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోననే భయంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నారు. తక్షణమే కళా వెంకరరావు గారి పై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు… లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు. రాష్ట్రంలో 19 నెలలుగా పాలన స్తంభించింది. ప్రతిపక్ష నాయకులే టార్గెట్ గా జగన్ రెడ్డి పాలన ఉంది. కక్షసాధింపులు, దాడులు, అత్యాచారాలు, దళితులపై దమనకాండ, అవినీతి నిత్యకృత్యంగా మారాయి. ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండాయి పోయింది. భవిష్యత్ లో ప్రజలే జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/