Primary Health Centers Medical Staff Dharna (eUPHCs) under Minimum Wage Act at GVMC Gandhi Statue in Visakhapatnam,Vizagvision.. మేము గత నాలుగు సంవత్సరాలుగా విశాఖ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వివిధ హోదాలలో చిరుద్యోగులుగా పని చేస్తున్నాము . కానీ వివిధ సందర్భాలలో ఎన్నో వినతులు తెలిసినప్పటికీ ఇప్పటివరకు సరైన న్యాయం జరగకపోగా బెదిరింపు ధోరణి లో వెళుతున్నారు. ఈ సందర్భంగా మేము పడుతున్న ఇబ్బందులను మీ దృష్టికి తీసుకురాదలచాము .
కనీస వేతన చట్టం ప్రకారం మా అందరి(eUPHCs) లో పని చేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలి ఇటీవల నూతనంగా ప్రారంభించిన UPHC వేతనాలు తో సమానంగా ఇవ్వాలి ఇప్పటివరకు మాకు ఇస్తున్నది కేవలం 9000/- రూపాయలు మాత్రమే.
EPF మరియు ESI చెల్లింపులో యాజమాన్య వాటా కూడా ఉద్యోగ జీతంలో నుంచి కడుతున్నారు. దాని వల్ల తీవ్రంగా నష్టపోతున్నాము.
లోన్ పాలసీ అమలు చేయకుండా EARNED LEAVES ENCASHMENT కాకుండా గత నాలుగు సంవత్సరాలుగా నొక్కిపెడుతూ ప్రసూతి సెలవులను కూడా (ESI Act) ప్రకారం కాకుండా చేస్తున్నారు.
కనీస సమయపాలన (8 గంటలు ) మించి పని చేస్తూ ఓవర్ టైం చేసినందుకు అలవెన్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
ఉద్యోగం నుండి అకారణంగా సమన్వయకర్తగా పనిచేస్తున్న P.S. Ramesh Babu మరియు P. Kesava Chaitanya తొలగించారు. దీనికి కారణం యాజమాన్యం చేస్తున్న తప్పులను ప్రశ్నించడమే.
e UPHC నుండి అధికారికంగా బయట విధులు నిర్వహిస్తున్నప్పటికీ TA మరియు DA ఇవ్వకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది.
వారాంతపు మరియు ప్రభుత్వ సెలవులను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు
4 వ తరగతి (Sweepers ) ఆఫ్ రోల్స్ గా పరిగణిస్తున్నారు.
మెమోలు , నోటీసులు వివరణలు తీసుకోకుండా ఏకపక్షం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటూ భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు .
గత నాలుగు సంవత్సరాలుగా బోనస్ చట్టం ప్రకారం బోనస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాగే గ్రాట్యువిటీ చట్టాన్ని అమలు చేయడం లేదు.
కోవిద్ కాలం లో ఎంతోకష్టం తో పనిచేసినప్పటికీ గత ఆరు నెలలుగా TA & DA మరియు స్పెషల్ అలవెన్సు ఇస్తామని మభ్య పెట్టి ఇవ్వకుండా చేస్తున్నారు.
SHOPS AND ESTABLISHMENT ACT 1988 ప్రకారం విశాఖ అర్బన్ జిల్లాలో 26 UPHCs గాను అందులో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం 26 x 7 = 182. మందికి eVaidya Pvt. Ltd. వారు తీసుకున్న లైసెన్స్ కేవలం 5 మందికి (Regd. No. AP-03-29-004-0815984) ప్రకారం గా.